Kakani Govardhan Reddy: వైసీపీ నుంచి సస్పైండెన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హంగామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసన్నారు.నాలుగేళ్ల నుంచి ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అంటూ కోటంరెడ్డిని ప్రశ్నించారు. పార్టీ నుంచి దూరమయ్యాకే సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ విరుచుకుపడ్డారు. అప్పట్లో వీటి గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో పాటు అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్నారు. నిబంధనల మేరకే అధికారులు అనుమతి ఇస్తారని.. నిరసన చేయాలంటే అనుమతి తప్పినిసరి అని ఆయన చెప్పారు.
Read Also: AP 40G: ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్
వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ 8 గంటలపాటు జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవడంతో పోలీసులు గృహనిర్బంధం చేశారు.