NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: పంట నష్టంపై అంచనావేస్తున్నాం.. బురద జల్లొద్దు..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటను నష్టపోతున్నారు రైతులు.. అయితే, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.. అనవసరంగా బురద జల్లొద్దని హితవుపలికారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు అందుతున్న పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు.. చంద్రబాబు హయాంలో అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగితే ఆ సీజన్ లో పరిహారం ఇచ్చారా..? అప్పుడు ఈ పత్రికలు ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పంట నష్టాలు.. ఇన్ ఫుట్ సబ్సిడీని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం.. కరువు మండలాల ప్రకటించలేదని రాయడం విచిత్రంగా ఉంది.. ప్రభుత్వం మీద బురద జల్లేందుకు అసత్యాలు రాస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Read Also: Mahesh Babu: జక్కన్న గండం దాటించే ధీరుడు ఎవరు?

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.. పంట నష్టాలపై అధికారులు అంచనాలు వేస్తున్నారు అని తెలిపారు మంత్రి కాకాణి.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఎందుకు ప్రశ్నించలేదన్న ఆయన.. చంద్రబాబు బకాయిలను వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత చెల్లించారని తెలిపారు.. రాష్ట్రంలో పంటల పరిస్థితిపై ఇప్పటికిప్పుడు వివరాలు సేకరిస్తున్నాం.. రైతులు నోటిపై చేయని పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.. చంద్రబాబు హయాంలో పసుపు కుంభకోణం జరిగింది.. ఆ విషయం వారికి ఎందుకు తెలియదని నిలదీశారు. రైతు రథం పథకంలో కమీషన్లు దండుకున్నారు.. రైతుల పేరుతో దోచుకున్నారు.. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధరలు వస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణా గోవర్ధన్‌రెడ్డి.

Show comments