Site icon NTV Telugu

Minister Jogi Ramesh: అందుకే జగన్‌ హీరో.. లోకేష్‌ జీరో..

Jogi Ramesh

Jogi Ramesh

Minister Jogi Ramesh: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు ఉందా? అని నిలదీశారు. ప్రజల గుండెల్లో నుంచి వచ్చాడు గనుకే వైఎస్‌ జగన్ హీరో అయ్యాడని తెలిపిన ఆయన.. తండ్రి ఇస్తే లోకేష్ కు మంత్రి పదవి వచ్చింది.. వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ జీరో అయ్యాడని కామెంట్ చేశారు. ఇక, 23 మంది మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు నైతిక విలువలు గుర్తుకు రాలేదా లోకేష్ కు? అని నిలదీశారు. ఈ విషయాలను కూడా గవర్నర్ కు చెప్పి ఉండాల్సింది కదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడ్డారు.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రూ. 3,300 కోట్ల రూపాయలను లూటీ చేశారు.. ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని స్పష్టం చేశారు.. మరోవైపు.. లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అట.. ఏ జాతికి ప్రధాన కార్యదర్శి? అంటూ సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్‌.

Read Also: Goshamahal Constituency: గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్

Exit mobile version