2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్. అన్ని వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరం. ఏ ఎన్నిక జరిగినా విజయ పరంపరతో గెలిచిన సంవత్సరం అన్నారు జోగి రమేష్. మా లీడర్ జగన్ నాయకత్వంలో 2022 విజయ నామ సంవత్సరం. ఇదే 2022 చంద్రబాబు కు బూతుల నామ సంవత్సరంగా మారిందన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆఖరికి చంద్రబాబు అడ్డా కుప్పం మున్సిపాలిటీతో సహా ఘోరంగా ఓడి పోయిన సంవత్సరం ఇదే అన్నారు జోగి రమేష్. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు వరకు 2022 బూతుల సంవత్సరం అయిందన్నారు.
మళ్ళీ మా బీసీలంతా ఇస్త్రీ చేసుకుంటూ, మగ్గాలు నేయాలని చెప్తారా ? జగనేమో మా బీసీలంతా ఉన్నతస్థాయికి చేరుకోవాలని చూస్తున్నారు. ట్యాబ్ లు, బైజూస్ కంటెంట్ తో చదువుకుని ప్రపంచాన్ని ఏలాలని చూస్తుంటే.. చంద్రబాబు మాత్రం మళ్ళీ చేపలు పట్టుకోవాలని, ఇస్ర్తీ చేసుకోవాలని చెప్తున్నారు. చంద్రబాబు, ఆయన కులం వాళ్ళే ఇంగ్లీషు చదువుకుని ఇతర దేశాలకు వెళ్లాలా? దుర్మార్గపు ఆలోచనలు చేసే నీకు మళ్ళీ ఎందుకు అధికారం ఇవ్వాలి? కందుకూరులో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు. మీరంతా ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తానని అన్నాడు. ఆయనకి చిన్నమెదడు చితికిపోవడం వలనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.
Read Also: Project K: షోరూమ్ కి వెళ్తే దండిగా దొరుకుతాయి టైర్లు…
అధికారం కోసం ఇంతగా దిగజారాలా? 24 గంటలు కూడా కాకముందే మళ్ళీ బహిరంగ సభలు పెడుతున్నారు. అభం శుభం తెలియని వారు చనిపోతే త్యాగం చేశారని చెప్పటానికి సిగ్గులేదా? నీ పదవుల కోసం పేదోళ్లు బలి కావాలా? ఏం.. నువ్వో, నీ కుటుంబ సభ్యులో త్యాగం చేయొచ్చుగా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నడ్డి విరిచేస్తాం అన్నారు. లోకేష్ పాదయాత్ర అంటే ఫ్యాషన్ షో అనుకుంటున్నాడు. అదేమైనా ఫిజికల్ ఎక్సర్ సైజా? పొలిటికల్ ఎక్సర్ సైజా? సీమ పందికి ఫ్యాంటు, షర్టు వేసినట్టుగా ఉంటుంది. వార్డు సభ్యునిగా కూడా గెలవలేని లోకేష్.. జగన్ ని విమర్శించటమేంటి? అని మండిపడ్డారు జోగి రమేష్.
ఆ పాదయాత్రకు యువగళం సూట్ అవదు. అందుకని పప్పుగళం, తుప్పుగళం, చిప్పగళం అని పేరుకుంటే మంచిది… పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాల్ స్వీకరించాలి. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైన చంద్రబాబుని అరెస్టు చేయాలి. చంద్రబాబు సభలపై పోలీసులు విచారణ జరపాలి. చంద్రబాబు చేసిన సవాల్ స్వీకరించటానికి నేను సిద్దం. చంద్రబాబుతో సహా ఎవరు వచ్చినా జనం మధ్య, మీడియా సమక్షంలో చర్చకు రెడీ కావాలి. టైం, డేట్, ప్లేస్ వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు జోగి రమేష్.
Read Also: Bairi Naresh: బైరి నరేష్ కోసం పోలీసులు వేట.. పీడీయాక్ట్ పెట్టాలంటున్న ఎమ్మెల్యే..