Jogi Ramesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఉయ్యూరులో పోలికేక పెట్టినా జనం నుంచి స్పందన లేదు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు.. చంద్రబాబు కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలనే ఈ పోరాటం చేస్తున్నారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారు అని ఆయన విమర్శలు గుప్పించారు. నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా.. యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగా అనుచరుడిగా ఉన్నాను.. బలహీన వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరులో పోటీ చేద్దాం అనుకుంటే నూజివీడు పంపి వెన్నుపోటు పొడిచారు.. అలాగే రెండు సార్లు ఎంపీ అయినా కొనకళ్ళ నారాయణరావుని కూడా వెన్నుపోటు పొడిచారు అంటూ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pamidi Samanthakamani: వైసీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా
పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వంద కోట్ల రూపాయలకు నా సీటు అమ్ముకున్నాడు అని అన్నాడు.. సీటు ఇవ్వకుండా ఉమాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అంటూ మంత్రి జోగి రమేష్ తెలిపారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నాడు అని బోడె ప్రసాద్ కి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది నువ్వు కాదా అని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఎక్కడి నుంచి అయినా గెలవగల సత్తా ఉంది కాబట్టే అప్పుడు రాజశేఖర్ రెడ్డి పెడన పంపించారు.. ఇప్పుడు జగనన్న పెనమలూరు పంపించారు అని జోగి రమేష్ పేర్కొన్నారు.