NTV Telugu Site icon

Minister Jogi Ramesh: బోడె ప్రసాద్‌కు టీడీపీ టికెట్.. మంత్రి జోగి రమేష్‌ సంబరాలు..

Jogi Ramesh

Jogi Ramesh

Minister Jogi Ramesh: కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేరును ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. టీడీపీ తాజాగా విడుదల చేసిన మూడో లిస్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పెనమలూరు సీటుకు బోడె ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.. అయితే, బోడెకి పెనమలూరు సీటు ఇవ్వడంతో.. ఆ స్థానంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న మంత్రి జోగి రమేష్ సంబరాలు చేసుకుంటున్నారు.. కార్యకర్తలకు స్వీట్లు పంచారు జోగి రమేష్.

Read Also: Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది

ఇక, ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు.. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అయితే, గత్యంతరం లేక చివరికి బోడె ప్రసాద్‌కి సీటు ఇచ్చాడని పేర్కొన్నారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామన్న ఆయన.. కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్, అలాగే పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నికగా అభివర్ణించారు.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి, పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్.