Minister Jogi Ramesh: బోడె ప్రసాద్‌కు టీడీపీ టికెట్.. మంత్రి జోగి రమేష్ సంబరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరును ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. టీడీపీ తాజాగా విడుదల చేసిన మూడో లిస్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పెనమలూరు సీటుకు బోడె ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.. అయితే, బోడెకి పెనమలూరు సీటు ఇవ్వడంతో.. ఆ స్థానంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న మంత్రి జోగి రమేష్ సంబరాలు చేసుకుంటున్నారు.. కార్యకర్తలకు స్వీట్లు పంచారు జోగి రమేష్.
Read Also: Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక, ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు.. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అయితే, గత్యంతరం లేక చివరికి బోడె ప్రసాద్‌కి సీటు ఇచ్చాడని పేర్కొన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామన్న ఆయన.. కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్, అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నికగా అభివర్ణించారు.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి, పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..