Site icon NTV Telugu

Jogi Ramesh: ఎందుకీ డ్రామాలు.. సానుభూతి పవనాలు

Jogi1

Jogi1

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన ఎపిసోడ్ నడుస్తోంది. మా ప్రభుత్వం మీద, పేదల ఇళ్ల నిర్మాణంపై విపక్షాలు, కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించామని, ఫేస్‌–1, ఫేస్‌–2 కింద 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే రామోజీరావుకు కళ్లు కనిపించడం లేదా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. పేదల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. ప్రభుత్వంపై బురదజల్లేలా వుందన్నారు. ‘మాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. మా ఇళ్ళు కూల్చలేదు’ అనే పోస్టర్లు వెలసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవేం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి జోగి రమేష్. ఇప్పటంలో వెలపిన బోర్డులను మంత్రి జోగి రమేష్ ప్రస్తావించారు.

 

Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?

ఎక్కడ డ్రామాలంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. మాకు అన్యాయం జరగలేదు. మీరు రావద్దంటూ ఇప్పటంలో బోర్డులు కనిపిస్తున్నాయి. ఒక రైతుకి సంబంధించిన ఇళ్ల నిర్మాణంలో చిన్న ప్రహారీ గోడ పాడైందన్నారు. ఇదిలా వుంటే.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది జనసేన పార్టీ. JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని, ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిద్దాం అంటున్నారు జనసేన నేతలు. రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న కాలనీలు.. అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్.

 

Read Also: Love Turns Tragedy: పెళ్లయ్యాక అతనితో ఎఫైర్.. లాడ్జిలో షాకింగ్ దృశ్యం

Exit mobile version