NTV Telugu Site icon

Minister Jogi Ramesh: జగన్ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు- పవన్- బీజేపీ కుట్ర

Jogi

Jogi

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్ తో పాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు.. ఇక, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి ఆ సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాళ్లు చేసిన యుక్తలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఒక తాటిపైకి వచ్చి జగనన్న అడుగుల్లో అడుగు వేసి ముందుకు సాగాలని కోరారు. మరోసారి జగన్ కు అధికారం అప్పగిస్తే.. మరింత చక్కటి పరిపాలన రూపొందించుకోగలమని ప్రజలు గుర్తించాలన్నారు.. జగనన్న ప్రత్యేకకు అండగా ఆసరాగా అభయహస్తంగా నిలిచారని మంత్రి జోగి రమేష్ అన్నారు..

Read Also: Dr K Laxman: సరిపడా టీచర్లను నియమించడం లేదు.. ప్రభుత్వంపై లక్ష్మణ్‌ ఫైర్‌

ఇక, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు. జోగి రమేష్ నేతృత్వంలో పెనమలూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దాల్సిన అవసరం ఉందని.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారన్నారు.. నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఐక్యతతో ముందుకు సాగలని ఆయన పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో వై నాట్ 175 సాధిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసామన్నారు పేదరికం తగ్గిపోయింది అన్నారు.. రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు నడుస్తుందన్నారు రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుంది.. ప్రజల సంతోషంగా ఉన్నారు.. ఐదు సంవత్సరాల తర్వాత పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధిని పరిశీలిస్తే నూటికి 99 శాతం హామీలు అమలు చేసి అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అంటూ ఎంపీ ఆయోధ్య రామిరెడ్డి తెలిపారు.