NTV Telugu Site icon

Jagadish Reddy : రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా అర్థం లేనిది

Minister Jagadish Reddy

Minister Jagadish Reddy

నల్లగొండ జిల్లా నూతనంగా ఏర్పడిన గట్టుపల్ లో తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా.. గట్టుప్పల్ ప్రజల 37 ఏళ్ల నిరీక్షణ కు ఫలితం లభించి నట్లయ్యింది… రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా అర్దం లేనిది… బహిరంగ మార్కెట్ లో 22 వేల కోట్లకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజ్ గోపాల్ రెడ్డి … కేంద్రం నుంచి మునుగోడు కు పైసా నైనా ఇచ్చినరా…. ద్రోహం, స్వార్దం తప్పా రాజ్ గోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే సోయి లేదు…. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా.

 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోటార్ లకు మీటర్ లు పెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారు… ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే బీజేపీ లక్ష్యం… బీజేపీకి ఓటేస్తే మోటార్ లకు మీటర్ లు రావడం ఖాయం… టీఆర్‌ఎస్ కు ఓటేస్తే ఇంటింటికీ తాగు నీరు, ప్రతి ఎకరానికి సాగు నీరు పారుతుంది.. సంక్షేమం కావాలో ? సంక్షోభం కావాలో ? మునుగోడు ప్రజలు తేల్చుకోవాలి… దేశమంతా తెలంగాణ మాదిరిగా కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు…. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు.