కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆపార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంల మునుగోడులో ఉప ఎన్నికల అనివార్యమైంది. అయితే.. ఇంకా ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల విడుదల చేయనప్పటికీ.. ఆయా పార్టీల్లో మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాకుండా.. మునుగోడులో అధికార టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయాలని పథకం పన్నుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికపై అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయని, టీఆర్ఎస్ కూడా రెడీ అవుతోందన్నారు. కార్యాచరణ రూపొందించుకునేందుకు ఇవాళ సమావేశమయ్యామని, ఎవరి స్వార్థం కోసం ఎన్నికలు వచ్చాయో వారిని ఎండ గట్టాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.
చౌటుప్పల్, నారాయణ పూర్, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సమావేశంకు హాజరు అయ్యారన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మునుగోడులో విఫలం అయ్యారన్నారు మంత్రి జగదీష్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ను గెలిపించుకోకపోవడం వల్లే నష్ట పోయామని మునుగోడు ప్రజలు భావిస్తున్నారన్నారు. అయితే.. రాజ్ గోపాల్ రెడ్డి మీడియాలో ఉన్నారని, మునుగోడు లో లేరంటూ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబ అభివృద్ధి కోసం మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చారని, మునుగోడు ఉప ఎన్నికను మేము సద్వినియోగం చేసుకుంటామన్నారు. మేము అందరం ఒక్కటిగా ఉన్నామని, కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా పంపిన మేము అంత కలసి పనిచేసి గెలిపిస్తాం అని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారన్నారు. అభ్యర్థి విషయంలో మాకు ఎటువంటి ఆలోచనలు లేవని మునుగోడు స్థానిక సంస్థల నేతలు చెప్పారన్నారు. అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
