NTV Telugu Site icon

Jagadish Reddy : ఈ రోజు ధర్మమే గెలిచింది

Jagadish Reddy

Jagadish Reddy

గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ నెల 3న మునుగోడు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ప్రస్తుతం 15వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దాదాపు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే.. దీంతో.. కౌంటింగ్ కేంద్రం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను టీఆర్‌ఎస్‌ నేతలు ప్రలోభాలకు గురిచేశారన్నారు. అంతేకాకుండ.. కేసీఆర్‌ అక్రమ సంపాదనకు సీపీఎం, సీపీఐ నేతలు అమ్ముడుపోయారని వారి ఓట్లతోనే గెలిచారన్నారు.

Also Read : Harish Rao : కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు
అయితే.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఇకనైనా శిఖండి రాజకీయాలు మానుకోవాలన్నారు. మునుగోడుకు సంబంధంలేని వాళ్లను తీసుకువచ్చి ఓటర్లకు మద్యం, డబ్బు సరఫరా చేశారని.. అయినప్పటికీ మునుగోడు ప్రజలు చైతన్యవంతంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించారన్నారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం మొదలుకావాలని వామపక్షాలు కలిసివచ్చాయని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, ఈ రోజు ధర్మమే గెలిచిందన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. కేసీఆర్‌ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని మంత్రి జగదీష్‌ రెడ్డి వెల్లడించారు.