రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.. రైతులకు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ లో నిర్వహించిన దసరా వేడుకల్లో జరిగిన అల్లర్లకు భారతీయ జనతా పార్టీదే బాధ్యత అని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రోటో కాల్ ప్రకారం రావణ దహన, షమీ పూజలో విశ్వహిందూ పరిషత్ (VHP) ఆహ్వానం మేరకు పూజలో పాల్గొన్నాను అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read Also: Rahul Gandhi: 2024లో పీఎం రాహుల్ గాంధీనే.. మిత్రపక్షం విమర్శలు..
బీజేపీ పార్టీ వాళ్లు కావాలని గొడవలు చేశారు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొ్న్నారు. దేవరకోట ఆలయ ఈవోని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించారు అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పారు. ఎన్నికలు అయ్యే వరకు బీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాలి అని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ గొడవలు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందనే విషయాన్ని ప్రజలందరు గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు.