Site icon NTV Telugu

Harish Rao: సిద్దిపేటలో హరీష్‌ రావు పర్యటన.. కోమటి చెరువులో 4500 డ్రోన్లతో షో

Harish Rao2

Harish Rao2

Harish Rao: మంత్రి హరీష్ రావు నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్‌ రావు పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు.

Read also: Balka Suman: కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనవాళ్ళే.. బాల్కాసుమన్‌ సంచలన వ్యాఖ్యలు

హరీష్‌ రావు శనివారం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే.. నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రక్రియ పూర్తయితే మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట శివారు రంగనాయక్ సాగర్ వద్ద తెలంగాణ తేజోవనం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని కోట్లాది మొక్కలు నాటారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో రైలు ట్రయల్ రన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు తొలిసారి నియోజకవర్గానికి రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్‌లో మంత్రి హరీశ్‌రావుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత చిన్న రాంపూర్ గ్రామంలో యాసంగిలో 18 లారీల ధాన్యం పండిందని గుర్తు చేశారు. తిట్టడంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీ పడుతుంటే.. సీఎం కేసీఆర్ వరికోతలో పోటీపడుతున్నారని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. వికలాంగులకు రూ.4,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.1000కు మించి పింఛన్ ఇవ్వడం లేదని విమర్శించారు. బలమైన నాయకుడు కావాలా? తప్పు నాయకుడు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు బలమైన నాయకుడు కావడం వల్లనే నేడు హరితహారంలో, తలసరి ఆదాయంలో, జీఎస్‌డీపీలో, ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో, వైద్యుల శిక్షణలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.
Astrology: ఆగస్టు 27, ఆదివారం దినఫలాలు

Exit mobile version