Harish Rao: ఎంఎన్‌జే క్యాన్సప్ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ శరత్‌తో కలిసి సందర్శించారు. ఆసుపత్రి పెండింగ్ పనులు, కొత్త బిల్డింగ్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల వల్ల జరిగిన నష్టంపై రిపోర్ట్ వచ్చిందని… రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎన్‌జే ఆస్పతిలో ఇప్పటికే 450 పడకలు ఉండగా.. మరో 300 పడకలతో మరో బిల్డింగ్ కడుతున్నామని.. దీంతో మొత్తం 700 పడకలు అవుతాయన్నారు. మెరుగైన వైద్యం కోసం పడకలు పెంచుతున్నామన్నారు. వచ్చే నెల 15న కొత్త హాస్పిటల్ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు.
BJP MP Laxman: తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులెన్ని?.. ఇప్పుడు మీ ఆస్తులెన్ని?
అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ అద్దంకి శరత్.. 3 ఏళ్ల పాటు.. 300 బెడ్స్‌కు శానిటేషన్, హౌజ్ కీపింగ్ సౌకర్యాలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, వారి నిర్వహణ ఉచితంగా చేస్తామన్నారని మంత్రి తెలిపారు. ఒక్క పైసా కూడా తీసుకోను అన్నారని తెలిపారు. నెల నెలా జీతాలు.. అన్నీ తామే చూసుకుంటామని చెప్పారన్నారు. ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఇటీవలే మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభించామన్నారు. రోబోటిక్ థియేటర్ టెండర్‌కు పిలుస్తామన్నారు. వైద్యుల కొరత ఉందని.. వంద మంది వరకు రిక్రూట్ చేస్తామని తెలిపారు. పేషెంట్ భోజనం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు.
