NTV Telugu Site icon

Harish Rao: ఓటుకు నోటు మరక ఉన్న రేవంత్ రెడ్డి మనకెందుకు..

Harish Rao

Harish Rao

Harish Rao Comments on Revanth Reddy: వరంగల్ జిల్లా నెక్కొండలో ఇవాళ ప్రచారం నిర్వహించిర మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలక్షన్స్ అనగానే ఢిల్లీ నంచి గల్లీ వరకు పూటకో లీడర్స్ వస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రి నిర్మళ సీతారామన్ మోటర్లకు మీటర్ల పెట్టలేదని అన్నారు. 28వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే నిధులు ఆపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీలు అంటు తిరుగుతున్నారు. కర్ణాటకలో 5గ్యారంటీలంటూ గెలిచి నేడు ఉన్న కరెంటుకు కోతలు విధిస్తున్నారు.

Also Read: Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!

కర్ణాటక లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఖజానా ఖాళీ అయిందట, కర్ణాటక పరిస్థితి మనకెందుకు. మోటార్లకు 10 hp మోటార్లు పెట్టాలంటాడు రేవంత్ రెడ్డి.. అది సాధ్యమా? రైతు ఎక్కడైనా 10hp మోటారు వాడుతారా? ఓటుకు నోటు మరక ఉన్న రేవంత్ రెడ్డి మనకెందుకు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ ఢిల్లీ లో ఉంది, మన పార్టీ మననాయకుడు ఉండగా ఇతర పార్టీలు ఎందుకు? రైతు బంధు రాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తే.. ఎలక్షన్ కమిషన్‌ను ఓప్పించి రేపో మాపో రైతు బంధు పైసలు పడేలా చేశాం. రైతు రుణమాఫీ దాదాపు పూర్తి స్థాయిలో అమలు చేశాం. మిగిలిన నాలుగు వేలకోట్లు రుణమాఫీ కూడా రేపో మాపో చేస్తాం. గృహిణి లకు 400 గ్యాస్ సిలిండర్. రిస్క్ వద్దు కారు కు గుద్దు’ అంటూ హరీష్ రావు నినాదించారు.

Also Read: Manchu Manoj: ఆస్తి గొడవలు.. మంచు బ్రదర్స్ మధ్య మాటలు లేవు..?