NTV Telugu Site icon

Minister Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే

Harish Rao

Harish Rao

మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లీడర్లు దొరకక కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది అంటూ సెటైర్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఫీజు కూడా తీసుకుని డబ్బులు వసూలు చేస్తుంది కాంగ్రెస్.. ఒక వేళ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుంది.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తారని ఆయన అన్నారు.

Read Also: Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ

ఎన్నికలు వచ్చినప్పుడు కనపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజా బలం లేదు.. కేవలం మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి లీడర్ లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు అంటూ మంత్రి సెటైర్లు వేశాడు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి ఇదే బీఆర్ఎస్ పార్టీ నినాదం అని హరీష్ రావు చెప్పారు.

Read Also: Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్

రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఉదయం బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్, జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాలను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయినా ఇందిరాగాంధీ మెదక్ కి రైలు తేలేదు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆ కలని నిజం చేశాడు.. 23వ తేదీని ఒక వేడుకలాగా జరపాలి.. మద్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభ చర్చి గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.