NTV Telugu Site icon

Minister Harish Rao: హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..

Harish Rao

Harish Rao

వరంగల్ లో హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సుమారు వెయ్యి మంది కార్మికులు పని చేస్తున్నారు. రూ. 20 లక్షల 76 వేల ఎస్ఎప్టీ తో హెల్త్ సిటి నిర్మిస్తున్నామని హరీష్ రావు అన్నారు. 2100 పడకలతో హెల్త్ సిటి నిర్మిస్తున్నామన్నారు. 800 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉంటాయి. 68 శాతం పనులు పూర్తయ్యాయి.. ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి చేసి జనవరిలోగా అందుబాటులోకి ఇంజినీరింగ్ అధికారులు తీసుకొస్తున్నారు అని ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.

Read Also: Ramakrishna : రమ్యకృష్ణ కు ఈ టాలెంట్ కూడా ఉందా?

దసరా వరకు 10 ఫ్లోర్ లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఆసుపత్రిలో అన్ని వసతులతో ధర్మశాలను నిర్మిస్తున్నాం.. 400 మంది రెసిడెన్సీ డాక్టర్స్ ఉంటారు.. వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ తో పాటు హెల్త్ సిటి ని నిర్మిస్తున్నాం అని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే సంవత్సరం ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Read Also: Nellore Crime: నెల్లూరులో విషాదం.. పిల్లల్ని రక్షించబోయి తల్లులు మృతి

ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో ఉన్న ములుగులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదు మంత్రి హరీష్ రావు అన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతమని సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. 70శాతం డెలివరీ లు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయి.. కాంగ్రెస్ పాలన తీసుకువస్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ పాలన అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సూది మందులు ఉండవు… గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి మంత్రి హరీష్ రావు పేర్కోన్నారు.

Read Also: Trivikram: సూపర్ స్టార్ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్…

కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయింది.. ఎయిమ్స్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది.. మెడికల్ కాలేజీల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.. కేంద్రం ఇచ్చింది ఒక్క మెడికల్ కాలేజీ అదికూడా అతిగతిలేకుండా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ళలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజల వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ కు దమాక్ పని చేయడం లేదు.. పని చేయరు.. చేసే వారిని విమర్శిస్తారు.. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.. నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వండి.. కానీ విమర్శించడం సమంజసం కాదు అని మంత్రి హరీష్ రావు అన్నారు.