NTV Telugu Site icon

Harish Rao : బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారు

Harish Rao

Harish Rao

గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభకు మంత్రి హరీష్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్‌ తమిళిసై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న గవర్నర్‌ని నేను తెలంగాణ బిడ్డగా గట్టిగా ప్రశ్నిస్తున్నానన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

Also Read : Tummala Nageswara Rao : ప్రజలకు జరిగిన మేలు చెప్పుకోవడానికే ఈ సమ్మేళనం

గజ్వేల్ కి రావాల్సిన ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు అడ్డుకొని గజ్వేల్ అభివృద్ధికి గవర్నర్ అడ్డుపడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గులాబీ సైనికుడిగా ఉద్యమకారుడుగా తనకు మాట్లాడే హక్కు ఉందన్న హరీష్ రావు.. ఎక్కడైనా అభివృద్ధి అంటే దేశానికి సంపద రావాలి బయట దేశాల్లో ఉన్నవారు తిరిగి మన దేశానికి రావాలని, కానీ.. ఇక్కడ రివర్స్ లో జరుగుతోందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పోకడ వల్ల దేశంలో ఉన్న సంపద బయట దేశాలకు తరలి పోతోందని ఆయన ధ్వజమెత్తారు. దేశంలోని పౌరులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారని విమర్శించారు మంత్రి హరీష్‌ రావు.

Also Read : Unni Mukundan : ప్రధాని మోడీతో మలయాళ నటుడు భేటీ.. నా అకౌంట్‌లో ఇదే పవర్ ఫుల్ పోస్ట్