NTV Telugu Site icon

Gummanur Jayaram To Join TDP: టీడీపీ గూటికి మంత్రి గుమ్మనూరు జయరాం..!

Jayaram

Jayaram

Gummanur Jayaram To Join TDP: ఏపీలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది.. మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.. దీనికోసం టీడీపీ పెద్దలతో జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారట మంత్రి.. అయితే, గుమ్మనూరు జయరాం.. పార్టీ మార్పులో కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కీలకపాత్ర పోషించినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, గుమ్మనూరు జయరాం గుంతకల్లు అసెంబ్లీ సీటు కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది..

Read Also: World’s Biggest Snake: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము ఎక్కడ ఉందో తెలుసా?

అయితే, ఆలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంను తప్పించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.. ఆ సీటుకు విరుపాక్షిని ఇంఛార్జ్‌గా నియమించింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని గుమ్మనూరుకు సూచించింది పార్టీ అధిష్టానం.. కానీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు జయరాం.. వైసీపీ అధిష్టానంతో పలుసార్లు సంప్రదింపులు జరిపినా ఎమ్మెల్యే టికెట్ లేదని వైసీపీ పెద్దలు స్పష్టం చేశారట.. దాంతో.. కొంత కాలం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఎవరికీ అందుబాటులో లేరనే ప్రచారం సాగింది.. ఇదే సమయంలో ఆయన టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లారట.. టీడీపీ నుంచి కూడా పాజిటివ్‌ సంకేతాలు ఉన్నాయని.. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.. అయితే, పార్టీ మార్పుపై గుమ్మనూరు జయరాం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

టీడీపీ గూటికి గుమ్మనూరు జయరాం | Gummanur Jayaram To Join TDP | Ntv