NTV Telugu Site icon

Gudivada Amarnath: ఢిల్లీలో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్‌

Minister Amarnath

Minister Amarnath

Gudivada Amarnath: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరుగుతోంది. ఈ ట్రేడ్ ఫెయిర్లో ఏపీ పెవిలియన్‌ను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రారంభించారు. 500 స్క్వేర్ మీటర్లలో ఏపీ పెవిలియన్‌ను ఏపీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ ఉత్పత్తులు, ప్రభుత్వ పథకాలు, ఫుడ్ కోర్టులు, టూరిజం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ట్రేడ్ ఫెయిర్ ద్వారా తెలియజేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. దేశంలో ఎగుమతుల్లో ఆరోస్థానంలో ఏపీ నిలిచిందన్నారు.

Also Read: Janasena: జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణం!.. జనసేన ఆరోపణలు

ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ 1గా ఏపీ ఉందన్నారు. మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లలో 45 వేల ఎకరాల్లో భూమి అందుబాటులో ఉందని.. ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఏపీలో నాలుగు పోర్టులు అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి అమర్‌నాథ్‌..10 ఫిషింగ్ హార్బర్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోస్ట్ లైన్‌ను ఉపయోగించుకునేలా ఏపీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. నేతన్న నేస్తం కింద గడిచిన 5 ఏళ్లలో 900 కోట్ల సహాయం అందించామన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమాన్ని, వ్యాపార అనుకూల పరిస్థితులు ప్రపంచానికి చాటేలా ట్రేడ్‌ ఫెయిర్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశామన్నారు.

Show comments