ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అని, అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేద వాడు అనుకుంటాడన్నారు. సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడని, సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుందన్నారు మంత్రి అమర్నాథ్. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్.. అని ఆయన అన్నారు. సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? అని ఆయన ప్రశ్నించారు.
సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడని, పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదన్నారు. సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనన్నారు. కొణతాల, దాడి వీరభద్రరావుపై అమర్నాథ్ సెటైర్లు వేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపానని, వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలన్నారు. అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారని, సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తానన్నారు మంత్రి అమర్నాథ్.
పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదని అమర్నాథ్ సెటైర్లు వేశారు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనని ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను కలిపిందే తానంటూ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఉద్ధేశిస్తూ అన్నారు. వాళ్ల ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని అన్నారు. అలాంటి వారు తనమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు.
