Site icon NTV Telugu

AP Fibernet Scam: ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం.. రూ.114 కోట్లు కొట్టేశారు

Gudivada Amarnath

Gudivada Amarnath

AP Fibernet Scam: చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారంటూ ఆరోపణలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఫైబర్‌నెట్‌ స్కాంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు తెలిసినవారికే ఫైబర్‌ నెట్‌ టెండర్లు కట్టబెట్టారు.. హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్లుగా పనిచేశారని విమర్శించారు. ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయన్నారు. రూ.330 కోట్ల కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. అందులో రూ.114 కోట్లను అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు.. అయితే.. ఈ స్కామ్‌ ఎలా జరిగిందో.. అసెంబ్లీలో ఓ టేబుల్‌ను డిస్‌ప్లే చేశారు మంత్రి అమర్నాథ్.

Read Also: Waheeda Rehman: సీనియర్ నటికి అరుదైన గౌరవం

మరోవైపు.. స్కిల్‌ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయన్నారు గుడివాడ అమర్నాథ్.. ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ సంస్థ తెలిపిందన్న ఆయన.. సీమెన్స్‌ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్‌ ఇచ్చారు.. సీమెన్స్‌ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదన్నారు.. చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్‌ టెండర్‌ కట్టబెట్టారు.. షెల్‌ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు.. హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్‌లుగా పనిచేశారు అంటూ అసెంబ్లీ వేదికగా ఆరోపణలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక, అసెంబ్లీ వేదికగా మంత్రి గుడివాడ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version