NTV Telugu Site icon

Gudivada Amarnath: జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలపడం ఖాయం

Gudiwada Amarnath

Gudiwada Amarnath

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాజకీయాలకు ఆస్కారం లేదనే సీఎం జగన్ చెప్పిన మాట చాలా గొప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు టీడీపీ పర్మినెంట్‌ పార్టీ అని, మిగిలినవన్నీ స్టెఫ్నీ పార్టీలేనని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. విశాఖలో నిర్వహించిన ప్రధాని మోదీ సభ ద్వారా రాష్ట్ర అవసరాలను, రావాల్సిన ప్రాజెక్టుల గురించి అడిగే అవకాశం లభించదన్నారు.

Read Also: MS Dhoni Joins BJP Photo Viral: బీజేపీలోకి ఎంఎస్ ధోని.. పక్కా ప్లాన్ అదే

ప్రధానితో పవన్‌ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. ఎంతసేపు టీడీపీకి మేలు చేయాలన్నదే పవన్‌ ఆలోచన అని విమర్శించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కోసమే ప్రధానిని కలిసినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ వ్యాఖ్యలు సంతాప సభలో మాట్లాడినట్లున్నాయని వ్యాఖ్యానించారు. సినిమా నటుడిగా హావభావాలు ప్రదర్శించే పవన్ ఎందుకు పేళవంగా మారారంటూ ప్రశ్నించారు. ప్రధాని సభ విజయవంతమవడంతో దానిని ప్రజలనుంచి డైవర్ట్ చేసేందుకే చిలుకగోరింక రుషికొండకు వెళ్లాయన్నారు. జనసేన రాజకీయ పార్టీ కాదు సినిమా పార్టీ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎప్పటికైనా నాదెండ్ల మనోహరే పవన్ ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు.

Show comments