NTV Telugu Site icon

Gudivada Amarnath: జనసేన క్యాడర్ చంద్రబాబుకి బానిసలా?

Gudivadaa2

Gudivadaa2

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారు. అన్ని వర్గాలతో మేము తరచు సమావేశాలు నిర్వహించుకున్నాం. జనసేన పొలిటికల్ పార్టీ కాదు సినిమా పార్టీ. విధానం సిద్ధాంతం లేని జనసేన పార్టీ. దాని గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదు. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్ లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుంది. ప్రజాస్వామ్యంలో పనికిరాదు. దీన్ని సమాజం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ పదిమందితో ప్రభుత్వం వస్తుందా?జనసేన నేతలు కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. రేపు చంద్రబాబుకి జనసేన సైనికులు బానిసలుగా బతకాలన్నారు మంత్రి అమర్నాథ్. పవన్ కంటే కేఏ పాల్ నయం… 175 సీట్లు పోటీ చేస్తాం అని చెబుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలియక ఎప్పుడో ఊహించినదే. వారు కలవడం విడిపోవడం సహజమే. కాపుల కోసం ముద్రగడ పోరాటం చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడు. అమరావతి రైతులు పాదయాత్ర పూర్తిగా మానుకోవాలని మేము కోరుతున్నాం అన్నారు మంత్రి అమర్నాథ్.

Read ALso: Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో రోహిత్‌ వేముల తల్లి.. ఫోటో వైరల్

విశాఖలో ఒత్సాహిక మహిళా పెట్టుబడిదారుల శిక్షణ సదస్సు ప్రారంభించారు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కొరియన్ కోయికా..ఎపి అలీప్ ల మధ్య ఆహార ఉత్పత్తుల తయారీ పై అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహిళా పారిశ్రామిక వేత్తలు కోసం విశాఖ లేదా అనకాపల్లి జిల్లాలో 25 ఎకరాల స్థలం కేటాయిస్తాం అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా ఆర్థిక ప్రగతి పై ప్రత్యేక శ్రద్ద వుంది. ఈ రోజు భారత వ్యాపార రంగంలో 14 శాతం మహిళా పారిశ్రామిక వేత్తలు వున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎపి టాప్ కేటగిరీ లో వుంది. కోడి గుడ్ల ఉత్పత్తి సేకరణ లో ఎపి నెంబర్ వన్ స్థానంలో వుంది. 60 శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఏపీలో జరుగుతోంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు మంత్రి అమర్నాథ్.

Read Also: Ghantasala: మధుర గాయకుడి బయోపిక్ కు మోక్షమెప్పుడో!?