Gudivada Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు వెల్ నెస్ సెంటర్‌లో కాదు.. జైల్లో ఉన్నాడు.. నేరం చేసినవాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టిందని సెటైర్లు వేశారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం చంద్రబాబు సింపతీ కోసం చేసే ప్రయత్నంగా దుయ్యబట్టారు.. ఇక, సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. దొంగతనం చేసిన వాళ్లు ఒక్కసారితో నిజం చెప్పరన్న ఆయన.. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయి.. కానీ, లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదు అని సెటైర్లు వేశారు. హెరిటేజ్ కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Health Tips : రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి..
మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు.. లోకేష్ తప్పుకి శిక్ష పడడం ఖాయం, కోర్టు కూడా ఈ విషయాన్ని నమ్మిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.. మరోవైపు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని సీఐడీ ప్రశ్నిస్తోంది.. తొలిరోజు 50 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. రెండో రోజు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభించిన విషయం విదితమే.