Site icon NTV Telugu

Minister Gottipati Ravikumar: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌.. మంత్రి కీలక ఆదేశాలు..

Gottipati Ravikumar

Gottipati Ravikumar

Minister Gottipati Ravikumar: వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు.. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని డిస్కంలను ఆదేశించారు. లోడ్ సమస్యలు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.. వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ స్థంబాలు, లూజుగా ఉన్న లైన్లు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.. గిరిజన ప్రాంతాల్లో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేయాలన్నారు.

Read Also: Tamayo Perry: సొర చేపల దాడిలో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడు మృతి

అయితే, విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ప్రాంతాల్లో.. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు మంత్రి గొట్టిపాటికి వివరించారు అధికారులు.. 2-3 నెలల్లో కొత్తగా 13 సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్. ఇక, ముఫ్త్ బిజిలి యోజన కింద రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఫలకాల ఏర్పాటును ముమ్మరం చేస్తున్నామని వెల్లడించారు.. ఏదేమైనా.. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని.. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Exit mobile version