Site icon NTV Telugu

Gottipati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచబోము.. వారికే రెడ్ బుక్ వర్తిస్తుంది!

Gottipati Ravikumar

Gottipati Ravikumar

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ర్పచారం చేశారని, పదే పదే ప్రభుత్వం మీద బురద చల్లే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పులు శుభ్రం చేయటానికే తమకు టైం సరిపోతుందని, విద్యుత్ శాఖను ఆయన దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెనేబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పుకొచ్చారు.

Also Read: Pawan Kalyan: నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి!

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… ‘విద్యుత్ చార్జీలు పెంచలేదు, పెంచబోము. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నాం. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ర్పచారం చేశారు. పదే పదే ప్రభుత్వం మీద బురద చల్లే పనులు చేస్తున్నారు. వైఎస్ జగన్ తప్పులు శుభ్రం చేయటానికే మాకు టైం సరిపోతుంది. విద్యుత్ శాఖను జగన్ దుర్వినియోగం చేశారు. యాక్సిస్ ఎనర్జీకి 5.12 రూపాయలకు పీపీ చేశారు. మేం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని 4.60 రూపాయలకు పీక్ అవర్స్ లో కూడా విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేశాం. జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను తమ ఆదాయ వనరుగా మార్చుకుంది. మేం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెనేబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశాం. రెనేబుల్ ఎనర్జీలో దేశంలో రాయలసీమ ప్రాంతం అనుకూలం. తప్పుచేసిన వారికి రెడ్ బుక్ వర్తిస్తుంది. అవసరం లేకుండా ఈ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టదు. గతంలో తప్పులు చేసి, అవసరం లేని పనులు చేశారో వారికే రెడ్ బుక్ వర్తిస్తుంది’ అని హెచ్చరించారు.

Exit mobile version