Site icon NTV Telugu

Gangula Kamalakar : ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో మంత్రి గంగుల వీడియో కాన్పరెన్స్

Minister Gangula

Minister Gangula

ధాన్యం సేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల అన్నారు. రైస్ మిల్లుల వద్ద స్పేస్ లేకున్నా.. మిల్లులు సహకరించకున్నా.. తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండి అంటూ ఆయన పేర్కొన్నారు. గతం కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేసిన మంత్రి తెలిపారు.

Also Read : Viral Video: ఎయిర్‌పోర్టులో పొట్టుపొట్టు తన్నుకున్నారు. వీడియో వైరల్..

ప్రతికూల పరిస్థితుల్లోనూ సేకరణ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు.. రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలి.. రాజకీయాలు పట్టించుకోకండి.. రైతులకు అండంగా ఉండాలని గంగుల అన్నారు. తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కావద్దు.. అందుకు రైతులు ఖచ్చితంగా ఎఫ్.ఏ.క్యూ ధాన్యం తెచ్చేలా చూడండి అంటూ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నీళ్లు, కరెంటుతో పాటు ఎంఎస్పీతో కొనుగోళ్లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.. ప్రతీ కలెక్టర్ తోనూ మాట్లాడి మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫోర్ట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని ఆయన తెలిపారు.

Also Read : Hyderabad: వీడిన చాదర్‌ఘాట్‌ హత్య కేసు మిస్టరీ..

పక్క రాష్ట్రాల్లో కొనుగోళ్లు లేనందున ఆ ప్యాడీ ఇక్కడకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.. రాబోయే పదిరోజులు అత్యంత కీలకం, యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలి అని మంత్రి గంగుల తెలిపారు. తెలంగాణలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుతో పాటు రవాణా చేసేందుకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మంత్రి వెల్లడించారు.

Exit mobile version