NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : కేసీఆర్ చేయబట్టే ఊర్లు బాగుపడ్డాయి, రాష్ట్రం బాగుంటుంది

Minister Errabelli Dayakar

Minister Errabelli Dayakar

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేషవాపూర్ గ్రామంలో రైతు వేదికను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని, 40 ఏండ్లల్లో ఇద్దరే రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారన్నారు. ఒకరు ఎన్టీఆర్, ఇంకొకరు కేసీఆర్. ఇక కొంత మంది మూర్ఖులు మేము అని చెప్పుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇదే ఊరిలో 600 పెన్షన్లు ఇస్తున్నామని, ఏడాదికి కోటి రూపాయలు ఇస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి.

 

కేసీఆర్ చేయబట్టి నీళ్లు వచ్చాయని, 24 గంటల కరెంట్ ఇచ్చారన్నారు. రైతుగా ఉన్నవారు కేసీఆర్‌ను మోసం చేయొద్దని ఆయన సూచించారు. కేసీఆర్ చేయబట్టే ఊర్లు బాగుపడ్డాయి,రాష్ట్రం బాగుంటుందని, బ్రిడ్జి కోసం 2కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. 50 లక్షలతో ఊరికి సీసీ రోడ్లకు మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.