పాలకుర్తి పర్యటనలో భాగంగా.. సేవాలాల్ ఆలయానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి భూమి పూజ నిర్వహించారు. తెలంగాణలో మొట్టమొదటి సేవాలాల్ ఆలయాన్ని పాలకుర్తిలో నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పాలకుర్తిలో ఈ సందర్భంగా రాజీవ్ చౌరస్తా నుంచి లంబాడీల సాంప్రదాయ వస్త్రాదరణంతో భారీ ర్యాలీ తీశారు. లంబాడీలతో కలిసి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత డాన్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి మరోసారి స్పందించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఒక్కశాతమే బ్రతికే అవకాశంఉందన్నారు.
Also Read : Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి
గిరిజన బిడ్డ అయిన ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడం బాధగా ఉందన్నారు. తన కూతురు పేరు కూడా ప్రీతి అని, మెడికో ప్రీతిని చూస్తే బాధేస్తోందన్నారు. ప్రీతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, దోషులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. చదువులో ముందుండే ప్రీతి కోలుకోవాలని కోరుకుంటున్నానని, వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరుతానన్నారు. మృత్యువుతో పోరాడుతున్న ప్రీతిని చూస్తే బాధేస్తుంది. వారి కుటుంబానికి నేను పూర్తి అండగా ఉంటా. ప్రీతిని వేధించినవారిని వదిలిపెట్టమని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
Also Read : Causeway Bridges : చాదర్‌ఘాట్, మూసారాంబాగ్‌లో రెండు కాజ్‌వే వంతెనలు