NTV Telugu Site icon

Dharmana Prasad Rao: మళ్ళీ మన జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది..

Darmana

Darmana

వైసీపీ పార్టీలో ఇపుడున్న విధానం సక్సెస్ ఫుల్ మోడల్.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు జోస్యం చెప్పారు. వాలంటీర్లను రిజైన్ చేయమనoడి.. వారితో పని చేయించండి అని పేర్కొన్నారు. నామినేషన్ రోజు ప్రతి వాలంటీర్ 25 మందిని తీసుకురమ్మనoడి.. ఎందుకంటే వాలంటీర్ మన పార్టీ కార్యకర్తే అని చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థి పై టీడీపీ వారే విమర్శిస్తున్నారు.. దానిని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి అని ఆయన చెప్పారు. నాకు ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇసారే ఎక్కువ మర్యాద వచ్చింది.. దానికి కారణం సోషల్ మీడియా.. కష్టపడి పని చేస్తే నెల రోజులలో అద్భుతాలు సృష్టించవచ్చు.. పార్టీకి పెద్ద నెట్ వర్క్ ఉంది అని మంత్రి ధర్మన ప్రసాద్ రావు వెల్లడించారు.

Read Also: MLC Jeevan Reddy: చైనా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ..

అయితే, వ్యూహాం సిద్దం చేసుకొని క్షేత్ర స్దాయిలో లీడర్స్ ముందుకు వెళ్లాలి అని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. ఎన్నికలలో మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.. క్రింద నుంచి పని చేసుకొని వచ్చాను.. నేను ప్రజా జీవితంలో నూటికి నూరు పాల్లు సంతృప్తిగా ఉన్నవాడిన్నారు. పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారో వారే సక్సెస్ అవుతారు.. బయటకు వెళ్లిన వారిని బస్సు చార్జీలు పెట్టి అయినా తెప్పించండి అని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి చేశాం.. అన్ని గ్రామాలలో మనకు మంచిగా స్వాగతం చెబుతున్నారు.. టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారో తెలియన పరిస్దితి ఉంది.. ప్రతి రోజూ నియోజకవర్గంలో ఒక వార్ రూం పెట్టుకొని.. సోషల్ మీడియాతో ప్రచారం చేయాలి.. నెల రోజుల్లో అద్బుతమైన ఫలితాలు వస్తాయని ధర్మన ప్రసాద్ రావు పేర్కొన్నారు.