Minister Dharmana Prasada Rao Letter To CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు ధర్మాన లేఖ ద్వారా తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం ఇచ్చే విధంగా ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి సీఎంను కోరారు. దీని కోసం 100 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్‌బీఐ రీజనల్ హెడ్ క్వార్టర్స్ తో సహా వివిధ బ్యాంకుల జోనల్ హెడ్ క్వార్టర్స్, వివిధ ఆర్ధిక సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని విన్నవించారు. దీని కోసం కేంద్ర ఆర్ధిక శాఖను అభ్యర్థించాలని ఆయన సూచించారు.
Dharmana Prasada Rao: ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి ధర్మాన లేఖ

Dharmana Prasada Rao