NTV Telugu Site icon

Dharmana Prasada Rao: వైసీపీ గుర్తు చాలా మందికి తెలియదు..! మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

Dharmana

Dharmana

Dharmana Prasada Rao: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.. ఓ వైపు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.. ఇంకో వైపు.. టికెట్లపై క్లారిటీ కోసం ఇండియా కూటమి అభ్యర్థులు వేచిచూస్తున్నారు. అయితే, ఎన్నికల తరుణంలో పార్టీ సింబల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే కే ఓటు వేస్తామంటున్నారు.. కానీ, వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికీ చాలామందికి తెలియటంలేదన్నారు.. వైసీపీ గుర్తు ఏంటి? అని అడిగితే.. కొందరు హస్తం గుర్తు అంటున్నారు.. మరికొందరు సైకిల్ గుర్తు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్‌ గుర్తును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తాం అన్నారు. మరోవైపు.. గెలవక ముందే పిటిషన్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీయించారు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు అన్నీ తీసేస్తారు అని హెచ్చరించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Read Also: Mumbai Indians: ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు ‘అతడు’ కావాలి: గవాస్కర్