Dharmana Prasada Rao: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చెప్పునట్లు చేసింది , మీ అవసరాలు తిర్చిందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాట ఇచ్చినట్లే పెన్షన్ పెంచి మూడు వేల రూపాయలు అందిస్తున్నాం అన్నారు. నిస్పృహాలో బ్రతుకుతున్న పేలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు.. ప్రతి రోజూ వైసీపీ విధానాలు తప్పబడుతూ మాట్లాడిన నేతలే నేడు అవే పథకాలను కొనసాగిస్తామని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక తాము అన్ని ఇస్తామంటారు.. ప్రజలు ఆలోచించుకోవాలి.. ప్రతిపక్షనేతల మర్మాలను గుర్తించాలని సూచించారు.
Read Also: Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి ఐదు మృతదేహాలు.. బోరున విలపించిన ఎమ్మెల్యే
ప్రజలు జీవన ప్రమాణాలు మామూలుగా మారిపోవు.. కానీ, వైసీపీ ప్రభుత్వం మీరు చెప్పునట్లు చేసింది, మీ అవసరాలు తిర్చిందన్నారు మంత్రి ధర్మాన.. ఓటు వేయడం అంటే ఐదేళ్లకు ఓ యజమానికి తాళం ఇవ్వడమే అవుతుందన్నారు. మే నెల తరువాత రాష్ట్రంలో ఇంకొకరికి తాళం ఇస్తే , ఈ వాలంటీర్లు ఎవరూ మీ ఇంటికి రారు అని తెలిపారు. ఈ వాలంటీర్స్ ను ఉంచబోమని చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. పేదల పథకాలు అన్నీ వృథా అని వ్యాఖ్యానించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. పన్నులు కడుతున్నామంటున్నారు కొందరు. పన్నులు కట్టే స్థాయికి వెల్లడమంటే అది ప్రజల డబ్బుతోనే కదా? అని ప్రశ్నించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.