NTV Telugu Site icon

Damodar Raja Narasimha: ఎవరైనా సీఎంని కలవొచ్చు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటి..?

Damodhara

Damodhara

సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆయన స్పందించారు. తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవొచ్చు అని తెలిపారు. పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యలపై మా ప్రభుత్వాన్ని వచ్చి ఎవరు కలిసిన మేము దానికి స్పందిస్తామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Read Also: Akshay Kumar: రియల్ స్టంట్స్ చేసే ఇద్దరు ఒకటే చోట ఉంటే ఇలానే ఉంటది

ఇక, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హై స్కూళ్లలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి రక్త పరీక్షలు చేస్తాం అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రక్త హీనత తక్కువగా ఉంటే అందుకు కావలసిన ఐరన్ టాబ్లెట్ లు ఇస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి కార్యక్రమం ఆందోల్ నియోజకవర్గంలో ప్రారంభించాము.. రక్తహీనత తక్కువగా ఉన్న విద్యార్థులు ఐరన్ స్థాయి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి అని ఆయన సూచించారు.