Site icon NTV Telugu

Damodara Raja Narasimha : ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తాం…

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి వైద్య వృత్తి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ శాఖ బాధ్యత చేపట్టి 10 నెలలు… ఎంతో అధ్యయనం చేశాను… ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు వెళ్తాము అని చెప్పారని, మాకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే.. నేను సీఎంతో మాట్లాడి వెంటనే 200 కోట్లు నిధులు విడుదల చేయించామన్నారు. హాస్టల్స్, ఇతర సమస్యలు పరిష్కారం చేశామని ఆయన తెలిపారు. IVF సెంటర్ లలో లక్షల్లో ఖర్చు చేస్తారని.. కానీ.. ఇవ్వాళ గాంధీ లో ప్రారంభించామన్నారు. అంతేకాకుండా.. మరో పదిహేను రోజులో పెట్ల బురుజు లో ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.

Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!

మరికొన్ని రోజుల్లో నిజామాబాద్, వరంగల్ లో ప్రారంభిస్తామని, అవసరమైతే ఇంకో సూపర్ స్పెషాలిటీ లో రెండవ యూనిట్ IVF సెంటర్ కూడా ప్రారంభిస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తామని, గత ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు లేకుండానే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందన్నారు దామోదర రాజనర్సింహా. మేము మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని ఈ 8 మెడికల్ కాలేజ్ లను పూర్తి స్థాయిలో తీసుకువచ్చామని, ఈమధ్య రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ల ఏర్పాటు చేశామన్నారు. 6 క్యాన్సర్ సెంటర్లను, పాలెటివ్ సెంటర్లు, పల్లెకు, ఆదివాసీ లకు కనీసం 15 నిమిషాల్లో వైద్యం అందించే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతినెలా 10 వ తేదీ లోపు డాక్టర్లకు స్టైఫండ్‌ వస్తుందని హామీ ఇస్తున్నామన్నారు.

AP Cabinet: 20 లక్షల ఉద్యోగ అవకాశాలు.. కేబినెట్‌లో చర్చకు ప్రభుత్వ నూతన పాలసీలు

Exit mobile version