NTV Telugu Site icon

Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు..

Damodhara Rajanarsimha

Damodhara Rajanarsimha

Health Department: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఇవాళ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య విధాన పరిషత్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఈ సమీక్ష సమావేశంలో మెడికల్ అండ్ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా చౌంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వీ కణ్ణన్, వైద్య విధాన పరిషత్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Read Also: Gorantla Butchaiah Chowdary: ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించాం.. అన్ని హస్పటల్స్ లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. గుంపులోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.. ప్రభుత్వం మాస్క్ నీ తప్పని సరి చేసినా చెయ్యక పోయినా ప్రతి ఒక్కరూ గుంపుల్లోకి వెళితే మాస్క్ నీ బాధ్యతగా ధరించాలి.. ఓమిక్రన్ వేరియంట్ కి సబ్ వేరియంట్ JN.1 కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు.. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుంది అంటూ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Show comments