NTV Telugu Site icon

Minister Venugopala Krishna: నిజం అంటే జగన్.. ఇది ప్రజల నమ్మకం..

Venugopalakrishna

Venugopalakrishna

Minister Venugopala Krishna: నిజం అంటే వైఎస్‌ జగన్.. ఇది ప్రజల నమ్మకం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ‘సత్యమేవ జయతే అని బాపూజీ అంటే.. అసత్యమేవ జయతే అంటాడు చంద్రబాబు’ అంటూ ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు ప్రజలు నమ్మలేదు… పవన్‌ కల్యాణ్‌, లోకేష్ నమ్ముకున్నాడని ఎద్దేవా చేశారు. నిజం అంటే జగన్.. ఇది ప్రజల నమ్మకంగా అభివర్ణించారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయటం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు మార్పు గేమ్ ఆడితే చంద్రబాబు కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదవాడికి సహాయం చేస్తున్న వాడిని ఓడించండి అనడం విడ్డూరం అని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్ ను ఓడించడానికి పార్టీ పెట్టానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను రాజకీయ కోవిధులు ఆలోచన చేయాలని సూచించారు. చంద్రబాబు అంటే అబద్ధం.. జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్‌ అయ్యిందని వ్యాఖ్యానించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

Read Also: TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం!