కేంద్రం సుముఖంగా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి కులగనన జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ నెల 19న ప్రారంభమైన కుల గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదరికం అనే రోగానికి సీఎం జగన్ సరైన చికిత్సను అందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు.
Minister Venu: రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోంది..

Minister Venu