Site icon NTV Telugu

Chelluboina Venu: చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్

Minister Venu

Minister Venu

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. దీనిపై మంత్రి చెల్లబోయిన వేణు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల తోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు స్కిల్ తో చేసిన స్కామ్ లు పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా? అంటూ మంత్రి వేణుగోపాల్ ప్రశ్నించారు. వాచ్ లేని చంద్రబాబు కోట్ల రూపాయలతో లాయర్లను ఎలా పెట్టుకున్నాడు అంటూ ఆయన అడిగారు.

Read Also: Theft: ముఖానికి మాస్క్.. అంత జాగ్రత్తగా వచ్చి నువ్వు చేసిన దొంగతనం ఇదా?

చంద్రబాబు అరెస్ట్ అయితే.. ఎవరు రావడము లేదని మహిళలను ముందు పెట్టి ఆందోళన చేయండని అచ్చెన్నాయుడు చెప్తున్నాడు అని మంత్రి వేణుగోపాల్ అన్నారు. అధికారులు చెప్పిన పట్టించుకోకుండా ఈ స్కామ్ చేశారు.. చంద్రబాబు సింపతి కోసం ప్రయత్నము చేస్తున్నాడు.. రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అని ఆయన తెలిపారు. సిఐడీ విచారణలో స్కామ్ యొక్క వివరాలు అన్ని బయట పడ్డాయని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు.

Read Also: Somu Veerraju: చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన సోము వీర్రాజు

చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే మా ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఆగేవాళ్లం కాదని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. కుట్రలతో గెలిచేందుకు టీడీపీ చూస్తుంది కానీ.. సీఎం జగన్ కాదు అని మంత్రి తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో స్కామ్ లను చేసిన వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వారిని వదిలి పెట్టాలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version