Theft: ముఖానికి మాస్క్.. అంత జాగ్రత్తగా వచ్చి నువ్వు చేసిన దొంగతనం ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Footwear Theft in Bangalore: ఈ మధ్య దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని వీటిని ఎందుకు దొంగతనం చేశారు అనేలా ఉంటాయి. ఇక అలాంటి దొంగతనమే ఒకటి తాజాగా బెంగుళూరులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Viral Video : ఓరి నాయనో.. కుక్క మనుషులతో వాలీ బాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా?
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ఈ వీడియోలో బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్ లోకి మాస్క్ పెట్టకొని ఓ యువకుడు వస్తాడు. అప్పుడు సమయం తెల్లవారు జాము 3:45 గంటలు అవుతుంది. తరవాత ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి పెద్ద పెద్ద సంచులు తీస్తాడు. రెండింటిని మెడలో వేసుకుంటాడు. ఒక రౌండ్ అటు నుంచి ఇటు వచ్చే సరికి అపార్ట్ మెంట్ లో ఉన్న చెప్పులన్ని ఆ సంచుల్లో నింపేస్తాడు. రెండు భారీ సంచుల నిండా చెప్పుులు నింపుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ అపార్ట్ మెంట్ లో ఇలా దొంగతనం జరగడం ఇది మూడోసారి. ఇలా తరచూ చెప్పులు పోవడంతో సీసీ టీవీలో దీని గురించి చూసిన వారు ఓ వ్యక్తి ఇలా చెప్పులు తీసుకువెళ్లడంతో ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ చెప్పులు తీసుకువెళ్లి ఏం చేసుకుంటారా అని ఆలోచిస్తున్నారు. సాధారణంగా గుళ్లలో చెప్పులు పోవడం చూశాం కానీ ఇలా ఇళ్లలోకి వచ్చి మరీ కొట్టేస్తారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాస్ట్లీ చెప్పులను లోపల దాచుకోవాలని సూచిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ దొంగలు ఏమైనా చెప్పుల షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారేమో అందుకే ఒకేసారి ఇన్ని చెప్పులు కొట్టేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. చెప్పుల దొంగతనానికి కూడా ఎంత పకడ్బందీగా వచ్చాడో అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!