Site icon NTV Telugu

Botsa Satyanarayana: పవన్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొత్స.. ఇలాంటి వాళ్లకి అధికారం కావాలట..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సభా వేదికపై నుంచి ఖండించారు.. మైక్ ఉందని మాట్లాడేకూడదు.. స్వార్థం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసిన వారికి పగ్గాలు అప్పజెప్పాలా? లేదా ప్రజా సంక్షేమం కోరి ఎన్నో పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాలా మీరే చెప్పండి? అంటూ ప్రశ్నించారు.

Read Also: Perni Nani: జగన్‌పై ద్వేషం.. బాబుపై ప్రేమ.. పవన్ మాటల్లో అది స్పష్టం..

పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొత్స.. వాలంటీర్లు అంటే.. పనికిమాలిన వాళ్లా..? ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ పిల్లలొచ్చి పనికిమాలిన‌ వాళ్లా..? వాళ్లకి టాలెంట్ లేదా? ఏంటి దౌర్భగ్యలా ఈ భాషా అంటూ ఫైర్‌ అయ్యారు. వ్యవస్థలను కాపాడాలని సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. ఏంటిది? అని ఆవేదన వ్యక్తం చేశారు. మైకుందని పవన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అని నిలదీసిన ఆయన.. యూజ్ లెస్ మాటలు మాట్లడడానికి.. పని చేసివవాళ్లని చెడగొట్టటానికేనా..? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడడం సరైందా..? ఇలాంటి వాళ్లకి అధికారం కావాలంట.. ఇదేం దౌర్భాగ్యాం మనికి.. అంటూ విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మరోవైపు మహిళా సంఘాలకు పడాల్సిన ఆసరా డబ్బులు ఇంతవరకు పడలేదని వెలుగు ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స..

Exit mobile version