NTV Telugu Site icon

Minister Botsa Satyanarayana: జగన్ కు రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

Boasta

Boasta

Minister Botsa Satyanarayana: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో ప్రధాని సభ విజయవంతమైందన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాన్ని సీఎం స్పష్టంగా వివరించారన్నారు. రాష్ట్ర ఆకాంక్షలను ప్రధానికి ముఖ్యమంత్రికి తెలియపరిచారని తెలిపారు. పార్టీలు కాదు అభివృద్ధే ముఖ్యమని సీఎం జగన్ అన్నారన్నారు. గతంలో ఈ తరహా వ్యక్తిత్వం ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఏయూ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి ప్రధాని మోదీ రథ సారథి అన్నారు. విశాఖపట్నంలో జనసముద్రం కనిపిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని… ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రూ. 10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు జగన్.

Read Also: AP Weather Alert: భారీ వర్షాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త

రుషికొండ నిర్మాణాలపై కొందరూ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అక్కడ ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నది వాస్తవం. ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి అని ప్రశ్నించారు. విభజన హామీల నుంచి ప్రత్యేక హోదా, పోలవరం వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి పోలవరం వరకు… పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పెద్దమనుసుతో వాటిని పరిష్కారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా చెప్పారు.

Show comments