Site icon NTV Telugu

Minister Botsa: డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక భేటీ

Minister Botsa

Minister Botsa

Minister Botsa Satyanarayana: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకటన, విధివిధానాల ఖరారుపై చర్చ కొనసాగుతోంది. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచాలని డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై కూడా చర్చిస్తున్నారు.

Read Also: Wedding Season: 3 నెలల్లో 30 ముహూర్తాలు.. ఈ నెల 11 నుంచి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్‌

జనవరి 31న సీఎం జగన్‌ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీలో టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ల విడుదలపై చర్చించారు.. 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ ృ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.

Exit mobile version