AP DSC 2024 Notification: ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త చెబుతూ.. ఇప్పటికే ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్ చేశారు.. మొత్తం 6,100 పోస్టుల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది.. ఇక, ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.. మార్చి 5వ తేదీ నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.. ఇక, మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషల్స్‌లో పరీక్షలు నిర్వహించనుండగా.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషల్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Read Also: Minister Ambati Rambabu: ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే.. ఆ తర్వాతే మూడు రాజధానులు..!
మరోవైపు.. 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.. జనరల్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్వహించామని.. రిజర్వ్ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్ల వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. ఇప్పుడు TRT రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నాం.. ఒక గంట తర్వాత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.. ఈ నెల 22వ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు.. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తాం.. ఏప్రిల్ 15వ తేదీ వరకు డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్.. ఇక, డీఎస్సీ నోటఫికేషన్ వెబ్ సైట్ ను లాంఛ్ చేస్తున్నాం.. రెండు జీవోలు విడుదల చేస్తున్నాం.. దాంట్లో రిక్రూట్‌మెంట్‌కు కావాల్సిన అర్హతలు అన్నీ పేర్కొన్నాం.. పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…