NTV Telugu Site icon

Minister Botsa: ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు..

Botsa

Botsa

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలియ చెప్పడానికే సామాజిక న్యాయ యాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది.. దేశంలోనే ఏపీలో మాత్రమే సామజిక న్యాయం జరిగింది‌ అని ఆయన అన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొవడానికి జగ‌న్ కృషి చేసారు.. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read Also: Leo Movie: ‘లియో’ లైన్ క్లియర్.. ఇక ‘కేసరి’తో ఢీకొట్టడమే లేటు!

బీసీలు సీఎం జగన్ ను కాపాడుకొవాల్సిన అవసరం ఉంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాటాడుతున్నారు‌.. తప్పు చేసి, స్కాంలు చేసి రిమాండ్ లో ఉంటే కేసే తప్పంటారు.. గజదొంగల్లా దోచుకు తిన్నారు.. ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం బావుందా లేదా కుటుంబం కోర్టును ఆశ్రయించాలి అని బొత్స హితవు పలికారు. టీడీపీ అబద్దాలు చెప్పడానికి తయారుగా ఉంటుంది.. రానున్న ఎన్నికలలో ఇచ్చాపురంలొ వైసీపీ జెండా ఎగర వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: Tarmarind Cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న చింత సాగు..

దోచుకు తినడం, ఆటలు సాగటం లేదు కనుక సీఎం జగన్ పోవాలంటున్నారు అని మంత్రి బొత్స అన్నారు. దేశంలో ప్రతి ‌ఒక్కరి హెల్త్ ప్రొపైల్ రేడి చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా‌?.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి అరోగ్యం అందిస్తున్నాం.. విద్య, వైద్యం కోసం ఎంతగానో కృషిచేస్తున్నాం.. పేదరిక నిర్మూలన కోసం జగన్ కృషి చేస్తున్నారు.. సెలబ్రిటీ లాంటి వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారు.. సీఎంను ప్రభుత్వాలు ఏకవచనంతో మాటాడుతున్నారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు‌.