NTV Telugu Site icon

Botsa satyanarayana: పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు

Botsa 1

Botsa 1

ఏపీలో రాజకీయం ఎన్నికలకు ముందే వేడెక్కింది. వైసీపీ వర్సెస్ జనసేన విమర్శల జోరు పెరుగుతూనే వుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్‌ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పవన్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది… ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు.?రిపబ్లిక్‌ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడుతారు. సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నాడన్నారు మంత్రి బొత్స.

Read Also: Balakrishna Response on SVR Issue Live: ఎస్వీ రంగారావు వివాదంపై బాలయ్య స్పందన

రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడతారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నాడు. పిచ్చెక్కి పోయి మాట్లాడుతున్నాడన్నారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఉగ్రవాది అయిపోతే… చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు? డీబీటీ ద్వారా 60 వేల కోట్లు ఇచ్చాం అన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడితే పవన్ కళ్యాణ్ కు ఏంటట బాధ?వాక్ స్వాతంత్రం ఉందని ఇలా మాట్లాడటం కరెక్టేనా? ఈ భాష ద్వారా వచ్చే తరాలకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు?

మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ అన్నారు. మూడు రాజధానులు మా విధానం అన్నారు. ఇంతకు ముందూ చెప్పాం… మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక పెద్ద బండి కొనుక్కుని ఉంటాడు. ఏముంది దాంట్లో?? దీనికి సన్నాసి, పనికి మాలిన మాటలు ఎందుకు. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే రాజకీయాలు అంటేనే విరక్తి వస్తోంది అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది దోపిడి విధానం, మాది అభివృద్ధి విధానం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాకు చిత్తశుద్ధి, ప్రేమ ఉండవా?కైకై అని అరిచి మాట్లాడితే ప్రేమ ఉన్నట్లా??విశాఖ రాజధాని పై బొత్స కీలక వ్యాఖ్యలు. కొత్త సంవత్సరాది నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని మేం ముఖ్యమంత్రి పై ఒత్తిడి చేస్తున్నాం. క్యాబినెట్ మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి కుదరదు అనరుగా. సానుకూలంగా స్పందిస్తారు.

Read Also: Balakrishna: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది