Schools Reopen: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై క్లారిటీ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. జూన్ 12వ తేదీ నుంచి అంటే ఈ నెల 12వ తేదీ నుంచి స్కూళ్లలో తరగతులు పునర్ ప్రారంభం అవుతాయని వెల్లడించారు.. అంతేకాదు. పిల్లలకు కావల్సిన అన్ని వసతులు జూన్ 12వ తేదీనే ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు.. ఇక, పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.. మరోవైపు.. ఈ నెల 20న రాష్ట్ర స్ధాయి, 17న జిల్లా స్ధాయి, 15న నియోజకవర్గ స్ధాయి టాపర్లకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: Viral Video: మేకల మందపై కోతి ఫీట్లు.. బాహుబలి 2 ఫైట్ సీన్ రిపీట్..!
ఇక, జూన్ 28వ తేదీన అమ్మవడి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు మంత్రి బొత్స.. అన్ని స్కూళ్లలో 6వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకూ డిజిటల్ విద్యను ప్రారంభించాలని నిర్ణయించామని వెల్లడించారు.. ఈనెల 12 నుంచీ ప్రతీ స్కూల్లో స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.. మరోవైపు.. జగనన్న గోరుముద్ద ఎంతో విజయవంతంగా జరుగుతోంది.. విద్యార్ధులపై ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రానికి, దేశానికి ఉపయోగకరం అని సీఎం వైఎస్ జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.