Site icon NTV Telugu

Minister Botsa Satyanarayana: సింగిల్‌ గానే పోటీ.. ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తులు..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Minister Botsa Satyanarayana: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతూనే ఉంది.. పోటీకి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. పొత్తుల వ్యవహారంపై కూడా చర్చలు సాగుతున్నాయి.. అయితే, ఆది నుంచి తాము సింగిల్‌గానే పోటీ చేస్తామని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతూ వస్తుంది.. సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయంటూ వైసీపీ నేతలు హాట్‌ కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే, ఏపీలో తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో మరోసారి పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది.. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Read Also: Tecno Camon 20 Premier 5G: మార్కెట్లోకి Tecno Camon 20 ప్రీమియర్ 5G.. ఫీచర్లు ఇవే..!

ఇక, ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ సెటైర్లు వేశారు మంత్రి బొత్స.. ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసిన ఆయన.. మార్చిలోనే సాధారణం ఎన్నికలు జరుగుతాయన్నారు. మా నాయుకుడు ప్రతి సభలోనూ చెప్పునట్టు అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా అజెండా.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీలతో మాకు పొత్తు అవసరం లేదన్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపుగా అన్ని పూర్తి చేశాం.. సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే.. వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లనే గెలిచుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.

Exit mobile version